
- భద్రాచలం – సత్తుపల్లి లైన్ కు రూ.405 కోట్లు
కేంద్రబడ్జెట్ ను ఇటీవలే పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది కేంద్రం. రైల్వే బడ్జెట్ ను కూడా చట్టసభల్లో టేబుల్ చేసింది. రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులను కూడా లోక్ సభముందు ఉంచింది కేంద్రం. భద్రాచలం -సత్తుపల్లి లైన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యాభై శాతం పైగా నిధులను ఒక్కసారే కేటాయించింది. రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
భద్రాచలం – సత్తుపల్లి న్యూ లైన్ ప్రాజెక్టు – రూ.405 కోట్లు
2010-11లో మంజూరైన ఈ ప్రాజెక్టు 56 కి.మీ. దూరం కవర్ చేస్తుంది.
అంచనా వ్యయం రూ.704కోట్లు. రైల్వేస్, సింగరేణి కాలరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో పూర్తికానుంది.
అక్కన్న పేట్ –మెదక్ న్యూ లైన్ ప్రాజెక్టు – రూ.20కోట్లు
ఈ ప్రాజెక్టు 2012-13లో మంజూరైంది. 17 కిలోమీటర్ల మార్గానికి రూ.118 కోట్లు ఖర్చు అంచనా. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులు చేస్తుంది. ప్రాజెక్టు ఖర్చులో 50శాతం తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది.
మనోహరాబాద్ –కొత్తపల్లి కొత్త లైన్ – రూ.200కోట్లు
ప్రాజెక్టు మంజూరైంది 2006-07లో.
150కి.మీ. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,160కోట్లు
మనోహరాబాద్ – గజ్వేల్ మధ్య 32 కి.మీ. తొలి దశ నిర్మాణం పూర్తికావొస్తోంది.
మునీరాబాద్ – మహబూబ్ నగర్ న్యూ లైన్ ప్రాజెక్టు – రూ.275 కోట్లు
1998-99 మధ్య మంజూరైన ప్రాజెక్టు ఇది.
246కి.మీ. దూరానికి రూ.645కోట్ల ఖర్చు. ఇందులో 66కి.మీ. తెలంగాణలో ఉంది. మిగతా లైన్ కర్ణాటకలో ఉంది. దేవరకద్ర-జక్లైర్ మధ్య భూసేకరణ జరుగుతోంది.
కాజీపేట్ –బల్లార్షా థర్డ్ లైన్ ప్రాజెక్టు – రూ. 265కోట్లు
2015-16లో మంజూరైన లైన్ ఇది. రూ.2063కోట్ల అంచనా వ్యయంతో 202 కి.మీ. పొడవు మార్గం.
సికింద్రాబాద్ – మహబూబ్ నగర్ డబ్లింగ్ ప్రాజెక్టు – రూ.200కోట్లు
2015-16లో మంజూరైన ప్రాజెక్టు ఇది. రూ.728కోట్ల ఖర్చు అంచనాతో 85కి.మీ. పొడువున నిర్మాణం.
కాజీపేట్- విజయవాడ థర్డ్ లైన్ – రూ.110 కోట్లు
2013-14లో మంజూరైన లైన్ ఇది. 219కి.మీ. పొడవున్న లైన్ ను రూ.రూ.1857కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు.
ఘట్కేసర్ –యాదాద్రి ఎంఎంటీఎస్ ఎక్స్ టెన్షన్ ఫేస్ 2 – రూ.20కోట్లు
2016-17లో మంజూరైంది. 33కి.మీ. పొడవైన మార్గం. రూ.412కోట్లు అంచనా వ్యయం.