ఇటీవల కాలంలో కొత్త జంటల్లో పిల్లలు పుట్టకపోవడం అనేది ప్రధాన సమస్య. కొత్త టెక్నాలజీతో కొంత ఈ సమస్య తీరినప్పటికీ చాలా మంది అండం, స్పెర్మ్ కణాల ఉత్పత్తి సమస్య ఇంకా అలాగే ఉంది. దీంతో చాలా జంటలు తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. గతంలో ఎలుకలపై ప్రయోగాలు చేసిన పరిశోధకులు స్టెమ్ సెల్స్నుంచి అండం, స్పెర్మ్ కణాలను తయారీని సక్సెస్ ఫుల్ గా చేశారు.ఇప్పుడు మరో ముందడుగు వేసి ఏకంగా మనిషి చర్మం నుంచి అండాలను ఎలా తయారు చేయాలో ప్రయాగాలు చేస్తున్నారు. ఇది పునరుత్పత్తి శాస్త్రంలో ముఖ్యమైన మైలురాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
చర్మం నుంచి ఉత్పన్నమయ్యే మూల కణాల నుంచి శాస్త్రవేత్తలు అండం కణాలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు. ఈ పురోగతి ఫెర్టిలిటీ సమస్యలు ఎదుర్కొంటున్న వారి చికిత్సలకు ముఖ్యమైన ఆధారం. ఎవరైనా దాతలు అండం డునేట్ చేస్తారో అని ఎదురు చూడకుండా ఓ మంచి పరిష్కారం. ఇది క్యాన్సర్ రోగులలో కూడా సంతానోత్పత్తిని కలిగించేందుకు మార్గం. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చాలామంది మహిళలు అండాశయ సమస్యలు, క్యాన్సర్ కారణంగా సంతానోత్పత్తి ని కోల్పోతుంటారు. ఇలాంటి వారిలో అండం రిలీజ్ కాకపోవడం అనేది ప్రధాన సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయోగ శాలలో అండాలను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తున్నారు పరిశోధకులు. ఇందులో రోగి చర్మం నుంచి తీసిన స్టెమ్స్ సెల్స్ ద్వారా అండ కణాలను ఉత్పత్తి చేస్తారు. ఇది దాతలకోసం ఎదురు చూసే మహిళలకు ఉపశమనం కలిగిస్తుంది. అండాశయ లోపం ఉన్న వారిలో కూడా జన్యుపరంగా సంతానం కలిగించేదుకు వీలు కల్పిస్తుంది.
ఈ విధానం కీమోథెరపీ చేయించుకునే యువ క్యాన్సర్ రోగులలో సంతానోత్పత్తిని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. చికిత్సకు ముందు చర్మ కణాల యొక్క చిన్న నమూనాను సేకరించి నిల్వ చేయడం ద్వారా, శాస్త్రవేత్తలు సిద్ధాంతపరంగా తరువాత జీవితంలో గుడ్లను ఉత్పత్తి చేయగలరు. వృద్ధులకు, ఇటువంటి సాంకేతికత 35 సంవత్సరాల వయస్సు తర్వాత గణనీయంగా తగ్గుతున్న అండాల నిల్వల సహజ క్షీణతను ఎదుర్కోగలదు.
ఇక కీమోథెరపీ చేయించుకునే యువ క్యాన్సర్ రోగులలో సంతానోత్పత్తికి కూడా సహాయపడుతుంది. చికిత్సకు ముందు చర్మ కణాల చిన్న నమూనాను సేకరించి నిల్వ చేయడం ద్వారా వారితో సంతానోత్పత్తికి అండాలను ఉత్పత్తి చేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.
చర్మం ద్వారా అండాలను తయారు చేసే పురోగతి వెనక ఉన్న టెక్నాలజీని సెల్యూలార్ రీప్రోగ్రామింగ్ అంటారు. ఇది ప్రత్యేక కణాలను తిరిగి ప్లూరిపోటెంట్ స్థితికి మార్చగల సామర్థ్యం. ఒకసారి రీప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ iPSCలు పునరుత్పత్తిలో పాల్గొన్న వాటితో సహా ఏదైనా కణ రకంగా మారవచ్చు.
ఏదీ ఏమైనా ప్రస్తుత కాలంలో సంతానోత్పత్తి సమస్యలకు చెక్ పెట్టేందుకు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ అందుబాటులో రావడం పేరెంట్స్ కలను సాకారం చేసుకోవాలనుకునేవారిలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఏ దాత అవసరం లేకుండా జన్యుపరమైన సమస్యలు లేకుండా పిల్లలను అందించడమే కాకుండా , ముఖ్యంగా క్యాన్సర్ రోగులలో సంతానోత్పత్తికి ఈ ప్రయోగం సక్సెస్ కీలకం.
