బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : ఉత్తమ్, రేవంత్

బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం : ఉత్తమ్, రేవంత్

బడ్జెట్ చాలా నిరుత్సాహ పరిచిందని అన్నారు నల్గొండ ఎంపీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కొత్తగా వారికి కేంద్రం ఏమీ చేయలేదన్నారు. పబ్లిక్ సంస్థల నుంచి కొన్ని పెట్టుబడులను వెనక్కి తీసుకుంటామన్నారని చెప్పారు.

బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపించారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చే పథకాలు లేవన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్ధం అవుతోందని విమర్శించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాది మంత్రి అయిన మోడీ చేతిలో కీలు బొమ్మ అయ్యారని ఆరోపించారు. సౌత్ ఇండియా నాయకులు ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలన్నారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా వ్యక్తిగత కేసులకు భయపడి.. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్లమెంట్ లో నోరుమెదపడం లేదన్నారు.  ఇన్ కమ్ ట్యాక్స్ లో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి.