ఈ జింకకు ట్రాఫిక్ రూల్స్ బాగా తెలుసు..రెడ్ సిగ్నల్ పడిందని రోడ్డుపైనే ఆగింది..

ఈ జింకకు ట్రాఫిక్ రూల్స్ బాగా తెలుసు..రెడ్ సిగ్నల్ పడిందని రోడ్డుపైనే ఆగింది..

జపాన్‌లో జింకల జంట తమ ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.రోడ్డుమీదకు వచ్చిన ఆ జింక, ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడగానే కచ్చితంగా ఆగిపోయింది. గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు ఓపికగా నిలబడి, తర్వాతే రోడ్డు దాటింది. ఈ ఘటనను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ నిబంధనలు మనుషులు పాటించకపోయినా, జంతువులు పాటిస్తున్నాయంటూ చర్చించుకున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు కూడా చర్చకు దారి తీసింది. 

ఈ వైరల్ వీడియో జపాన్‌లోని నారా పార్క్ దగ్గర జరిగిన సంఘటనకు సంబంధించింది. ఈ పార్కు జింకలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్లిప్‌ను డిజిటల్ సృష్టికర్త @amina_finds ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. జపాన్‌లో జింకలు కూడా జైవాక్ చేయవు. అందరూ చాలా క్రమశిక్షణతో ఉంటారు  అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జపాన్లో జింకలు1000IQ గలవి అని కూడా రాశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ameana Finds (@amina_finds)

వీడియోలో రాసినట్లు నిజంగానే ఆ రెండు జింకలు ఓపిగ్గా ఆగి, ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ వచ్చాక రోడ్డు దాటాయి. జింకలలో కూడా మనుషుల్లో ఉన్న సృహను చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. కాంతి ఆకుపచ్చగా మారిన క్షణం, జింకలు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి భయం లేకుండా రోడ్డు దాటడం వీడియోలో కనిపిస్తుంది. 

జపాన్‌లోని నారా పార్క్.. 

ఈ వీడియో జపాన్‌లోని నారా పార్క్ నుంచి తీసుకున్నారు. నారా పార్క్ జపాన్‌లో ప్రసిద్ధి చెందిన యునెస్కో వారసత్వ ప్రదేశం. ఇక్కడి సికా జింకలు స్థానిక పవిత్ర దేవతల దూతలుగా పూజిస్తారు. పర్యాటకులు ఆహారం అందిస్తే అవి మర్యాదగా నమస్కరించడం వీటిలో ఓ ప్రత్యేకత. ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఘటన వాటిలోని తెలివితేటలకు మరో ప్రత్యేకతనుచూపిస్తుంది.