యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఆందోళన

యూపీ అసెంబ్లీలో ఎస్పీ ఆందోళన

యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ సభలో ఆందోళన చేపట్టింది. నిత్యావసర ధరల పెరుగుదల, శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయని ప్లకార్డులతో నిరసన ప్రదర్శించింది. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరు రోజుల పాటు యూపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు ఎమ్మెల్యేలుగా సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆజం ఖాన్, అబ్దుల్లా అజాం ప్రమాణ స్వీకారం చేశారు. సభలో ఎస్పీ ఆందోళన చేయడం సరికాదని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సమస్య ఏదైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎస్పీ ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. 

https://www.youtube.com/watch?v=zcBM67oIL5w

మరిన్ని వార్తల  కోసం

డ్యామ్ ఎక్కబోయి జారిపడ్డ యువకుడు

వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి