ఫిబ్రవరి13 వరకు అసెంబ్లీ.. 10న బడ్జెట్

  ఫిబ్రవరి13 వరకు అసెంబ్లీ..  10న బడ్జెట్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2024 ఫిబ్రవరి 13 వరకు నిర్ణయించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా..  రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది.  ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవే తొలిసారి బడ్జెట్‌ సమావేశాలు కాగా... పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. 

ఈ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని సంతరించుకున్నాయి.   పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపటానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది.  అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి దూరంగా ఉన్న కేసీఆర్..  ఫిబ్రవరి 10వ తేదీన  అసెంబ్లీకి రానున్నారు.