వంద కోట్ల కారు.. తయారీకి 65 వేల గంటలు పట్టిందట!

వంద కోట్ల కారు.. తయారీకి 65 వేల గంటలు పట్టిందట!

లగ్జరీ కార్ల కంపెనీ అయిన బుగాటీ నుంచి మరో భారీ కారు వచ్చేస్తోంది. భారీ అంటే సైజులోనని పొరబడేరు. కాదండీ ధరలో భారీతనంతో ఈ ఫ్రెంచ్ హైపర్‌కార్ మ్యానుఫ్యాక్చరర్ మన ముందుకొచ్చేసింది. లా వాయిచర్ నొయిరే ( La Voiture Noire) పేరుతో పిలుస్తున్న ఈ కొత్త బుగాటీ కారు ధర అక్షరాలా 13.4 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారుగా 100 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారు తయారీకి దాదాపుగా 65 వేల పనిగంటలు ఇంజనీర్లు శ్రమించారంటేనే అర్థం చేసుకోవచ్చు దీని గురించి ఎంతలా కష్టపడ్డారో. లా వాయిచర్ నొయిరే అంటే ఫ్రెంచ్ భాషలో నలుపు కారు అని అర్థం. అదే రంగుతో ఇది రూపొందడం విశేషం. అద్భుతమైన ఫీచర్లతో డిజైన్ చేసిన ఈ కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇప్పటికే కొనుగోలు చేసినట్లు సమాచారం. 2019లో జెనీవాలో నిర్వహించిన ఆటో షోలో ఇంట్రడ్యూస్ తొలి మోడల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు తదుపరి మోడల్‌ను సెంటొడిసి పేరుతో తయారు చేస్తున్నారు. ఈ ఏడాది ముగింపులో ఈ మోడల్‌ను సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.