
ములుగు జిల్లా: మంగపేట మండలం, కమలాపురంలోని మూతపడ్డ బిల్ట్ కర్మాగారం తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు ఆ ఫ్యాక్టరీ కార్మికులు. సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం కమలాపురం నుంచి పాదయాత్రగా హైదరాబాదులోని ప్రగతి భవన్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ..కర్మాగారం తిరిగి పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, తమకు వేతనాలు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు. 73 నెలల నుండి జీతాలు, 64 నెలల నుండి పీఎఫ్ బకాయిలు పెండిగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించడానికే ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టామని కార్మికులు తెలిపారు.