
ప్రభాస్ నటిస్తున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఎడి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. జూన్ 27న పాన్ వరల్డ్ మూవీగా విడుదలవుతోంది. భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, రీసెంట్‌గా ‘బుజ్జి’ పేరుతో ఓ స్పెషల్ వెహికల్‌ను పరిచయం చేశారు. అయితే బుజ్జి అండ్ భైరవగా 2డీ యానిమేటెడ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు మేకర్స్.
ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘గత ఐదేళ్లుగా ఈ మూవీకోసం పని చేస్తున్నాం. సినిమా కంటే ముందే యానిమేషన్ సిరీస్‌తో లాంచ్ అవ్వడం సంథింగ్ న్యూ. ఇలా విడుదల చేయడం వైజయంతీ మూవీస్ సంస్థ బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్‌పెరిమెంట్ థింగ్’ అని చెప్పాడు.