తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అండ: బుక్క వేణుగోపాల్

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అండ: బుక్క వేణుగోపాల్
  • ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం 

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుక్క వేణుగోపాల్,  బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.  అనంతరం వారు మాట్లాడుతూ..  తెలంగాణ అభివృద్ధికి  కేంద్రంలోని  బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.  పసుపు బోర్డు,  గిరిజన విశ్వవిద్యాలయం, కృష్ణా నీళ్ల పంపకంపై ట్రిబ్యునల్, రూ. 600 లకే ఉజ్వల గ్యాస్ సిలిండర్, 33% మహిళ రిజర్వేషన్ బిల్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. 

 బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బైతి శ్రీధర్ మాట్లాడుతూ బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టిపీడిస్తున్నదని ఆరోపించారు.  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను కబ్జా చేసి తన అనుచరులకు దోచి పెడుతున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో నర్కూడ సర్పంచ్ సున్నిగంటి సిద్దులు, జూకల్ ఎంపీటీసీ, -శంషాబాద్ మండల రూరల్ బీజేవైఎం బుక్క ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్ , బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు వంశీ యాదవ్, బురుకుంట సంజీవ, ఎల్గని నగేశ్, కిట్టు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.