వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా ప్రేమానురాగాలుంటాయని నిరూపించాయి ఓ ఆవు మరియు ఎద్దు. తమిళనాడులోని మధురై సమీపంలో పలమెడుకు చెందిన మునియండిరాజా టీ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి లక్ష్మి అనే ఒక ఆవు ఉంది. రాజా తన ఆవును.. సమీపంలోని గుడికి చెందిన మంజమలై అనే ఎద్దుతో కలిపి పెంచాడు. రాజా తన ఆవును సాదలేక పొరుగూరికి చెందిన వ్యక్తికి అమ్మాడు. దాంతో రాజా తన ఆవును ఒక ట్రక్కులోకి ఎక్కించి.. ఆ వ్యక్తితో వారి ఊరికి పంపాలనుకున్నాడు. అయితే ట్రక్కులో ఆవును తీసుకెళ్తుండగా.. ఎద్దు ట్రక్కు వెంట పరుగు తీయడం మొదలుపెట్టింది. మొదట రాజాకు ఏం అర్థం కాలేదు. కానీ, కొంతదూరం వెళ్లిన తర్వాత ట్రక్కును ఆపగానే.. ఎద్దు ట్రక్కులోని ఆవును చూస్తూ ఉండిపోయింది. అప్పడు రాజాతో పాటు.. ఆవును కొన్న వ్యక్తికి అసలు విషయం అర్థమైంది. ఇన్నాళ్లు కలిసి పెరిగిన ఆవు, ఎద్దు ఒకదాన్ని విడిచి మరోటి ఉండలేకపోతున్నాయని తెలిసింది. ఎద్దు.. ఆవును ఎక్కించిన ట్రక్కు చుట్టూ తిరుగుతూ అక్కడే ఉంది. మళ్లీ కాసేపటికి ట్రక్కు ముందుకు కదలడంతో.. ఎద్దు కూడా పరుగు మొదలుపెట్టింది.

ఈ సంఘటనను అక్కడే ఉండి గమనించిన జయప్రదీప్ అనే వ్యక్తి ఆవును కొన్న వ్యక్తికి డబ్బు ఇచ్చి.. ఆ ఆవును గుడికి దానమిచ్చాడు. అలా మళ్లీ ఎద్దు, ఆవు కలిసిపోయాయి. ఇంతకూ, ఈ రెండింటిన కలిపిన జయప్రదీప్ ఎవరో తెలుసా.. స్వయానా తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొడుకే కావడం గమనార్హం.

For More News..

వీసాల రద్దు విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్

మూడు బల్బులు, ఒక్క టీవీ.. కరెంటు బిల్లు రూ. 1.66 లక్షలు

పోలికలే కాదు.. మార్కుల్లోనూ ట్విన్స్