టోక్యో: అభివృద్ధిలో మెరుపు వేగంతో దూసుకెళ్తున్న భాగ్యనగిరికి అంతే స్పీడున్న హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ (బుల్లెట్ ట్రైన్) వచ్చే అవకాశముంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ బుల్లెట్ రైలు కూత పెట్టే చాన్స్ ఉంది. ముంబై–-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును చేపట్టిన జేఆర్ సెంట్రల్ (జపాన్ రైల్వే కంపెనీ) సంస్థే ఈ విషయం వెల్లడించింది. ఈ ఐదు ప్రధాన నగరాల్లో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని, చర్చలింకా మొదలవలేదని చెప్పింది. ముంబై–-అహ్మదాబాద్ ప్రాజెక్టును బట్టే ఈ ఐదు చోట్ల విస్తరణ ఆధారపడి ఉంటుందని జేఆర్ సెంట్రల్ డైరెక్టర్ టోర్కెల్ పాటర్‌సన్ వెల్లడించారు.
2023 నాటికి కాదు
ముంబై–అహ్మదాబాద్ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ మరో ఏడాది ఆలస్యమయ్యేలా ఉంది. 505 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును సుమారు రూ.83 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. 12 స్టేషన్లు (మొదటి పేజీ తరువాయి)
కడుతున్నారు. ప్రాజెక్టు ఎంవోయూ 2015లో కుదుర్చుకోగా ప్రధాని మోడీ చేతులమీదుగా 2017లో పనులు ప్రారంభించారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు రెండు గంటల ఏడు నిమిషాల్లోనే చేరుకుంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ సమస్యలున్నాయని, కాబట్టి 2023లోగా పూర్తవదని పాటర్‌సన్ చెప్పారు. అవసరమైన భూమి వచ్చాక ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని వెల్లడించారు. రైలు టికెట్, ఇతర రెవెన్యూ మోడళ్లకు సంబంధించి చర్చలు పూర్తయ్యాయని చెప్పారు.
ఇండియా ఎకానమీకి ఊతం
జపాన్ ‘షిన్‌కాన్‌సెన్’ టెక్నాలజీని బుల్లెట్ ప్రాజెక్టుకు వాడుతున్నామని పాటర్‌సన్ చెప్పారు. షిన్‌కాన్‌సెన్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ మాత్రమే కాదని, ట్రాన్స్‌ఫార్మేషన్ కూడా అని వివరించారు. దీని వల్ల జపాన్ లానే ఇండియాలోనూ ఎకానమీ పరుగు పెడుతుందని చెప్పారు. బుల్లెట్ ట్రైన్లను ఎకనమిక్ హబ్ ప్రాంతాల్లోనే నిర్మిస్తే బాగుంటుందన్నారు. ఇండియాకు ముంబై ఫైనాన్షియల్ రాజధాని, దేశంలో వజ్రాల వ్యాపారానికి అహ్మదాబాద్ గుండె లాంటిది కాబట్టే ప్రాజెక్టు చేపట్టేందుకు జపాన్ ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు.