న్యూఢిల్లీ: మనదేశ సోలార్కరెంట్ తయారీ సామర్థ్యం 2025 ముగిసేనాటికి 125 గిగావాట్లు దాటుతుందని, ఇది దేశీయ డిమాండ్ (సుమారు 40 జీడబ్ల్యూ) కన్నా మూడు రెట్లు ఎక్కువ అని వుడ్ మెకెంజీ స్టడీ రిపోర్ట్ తెలిపింది. ప్రొడక్షన్ లింక్డ్ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం కారణంగా వేగంగా తయారీ పెరిగినా, ఇప్పుడు అదనపు సామర్థ్యం సమస్య ఎదురవుతోంది.
అమెరికాకు ఎగుమతులు 52 శాతం పడిపోయాయి. చైనా మాడ్యూల్స్‌తో పోలిస్తే భారతీయ తయారీ ఖర్చు ఎక్కువగా ఉండడం సమస్యగా మారింది. దేశీయ ఉత్పత్తిదారులకు మద్దతుగా చైనా మాడ్యూల్స్‌పై 30 శాతం యాంటీ- డంపింగ్ సుంకం విధిస్తున్నారు. కేర్‌ఎడ్జ్ అడ్వైజరీ అంచనా ప్రకారం, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశం సౌర సామర్థ్యం 216 గిగావాట్లకు చేరుకునే అవకాశం ఉంది.
