సిరీస్పై పట్టు సాధిస్తారా..? ఇవాళ (నవంబర్ 06) ఆసీస్తో నాలుగో టీ20.. ఇండియా ప్లస్ పాయింట్స్ ఇవే!

సిరీస్పై పట్టు సాధిస్తారా..? ఇవాళ (నవంబర్ 06) ఆసీస్తో నాలుగో టీ20.. ఇండియా ప్లస్ పాయింట్స్ ఇవే!
  • సూపర్ ఫామ్ లో అభిషేక్ శర్మ
  • అర్ష్ దీప్ రాకతో పెగిరిగ బౌలింగ్ బలం
  • మ. 1.45 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో

గోల్డ్‌‌‌‌కోస్ట్: ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌పై అందరి ఫోకస్ ఉండగా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో ముందంజ వేయాలని టీమిండియా భావిస్తోంది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌లో భాగంగా గురువారం (నవంబర్ 06) జరిగే నాలుగో టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి పోరు వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దవగా.. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓటమికి ఇండియా వెంటనే బదులు తీర్చుకుంది. సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–-1తో సమంగా నిలవడంతో గోల్డ్‌‌కోస్ట్‌‌లోని కరారా ఓవల్ వేదికగా జరిగే ఈ పోరు కీలకం కానుంది. 

గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అద్భుతమైన విజయం సాధించడంతో ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆ విక్టరీతో మన టీ20 బ్యాటింగ్ డెప్త్ మరోసారి రుజువైంది. యంగ్‌  ఓపెనర్ అభిషేక్ శర్మ నిలకడగా రాణిస్తూ సిరీస్‌‌‌‌‌‌‌‌లో 167.16 స్ట్రైక్ రేట్‌‌‌‌‌‌‌‌తో టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. అతని ఫామ్ టీమ్ ప్రధాన బలం. మరోవైపు, గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జట్టులోకి వచ్చిన ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు, బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ రాణించి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఇండియా వైపు తిప్పాడు. 

అయితే, కెప్టెన్ శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ ఫామ్ మాత్రం ఇండియాను  కలవరపెడుతోంది. గత ఆరు ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. ఈ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి అతను వరుసగా 10, 9, 24, 37*, 5,15 స్కోర్లు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. గత రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో మళ్లీ ఫెయిలైన గిల్ త్వరగా గాడిలో పడాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ కోరుకుంటోంది. ఓవైపు వరల్డ్ నంబర్ వన్  అభిషేక్ అద్భుతంగా ఆడుతుండగా.. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ తడబాటు వల్ల జట్టుకు శుభారంభాలు లభించడం లేదు. 

సిరీస్‌‌‌‌‌‌‌‌ లో అత్యంత కీలకమైన ఈ పోరులో అయినా తను మెప్పిస్తాడేమో చూడాలి. ఇక,  కుల్దీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌ను జట్టు నుంచి రిలీజ్ చేసినా.. పేసర్ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ తుది జట్టులోకి రావడంతో  బౌలింగ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ మెరుగైంది. అయితే, శివమ్ దూబే గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో (3 ఓవర్లలో 43) ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆల్-రౌండర్ కోటాలో గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డిని  తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది. 

 హెడ్ ఔట్.. మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్ ఇన్‌‌‌‌‌‌‌‌ 

ప్రస్తుతం ఇండియాతో పోరుకంటే ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో యాషెస్ టెస్ట్ సిరీస్‌‌‌‌‌‌‌‌పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. టెస్ట్ సిరీస్ సన్నద్ధత కోసం డ్యాషింగ్‌ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఈ సిరీస్ నుంచి వైదొలగడం ఆసీస్‌‌‌‌‌‌‌‌కు పెద్ద ఎదురుదెబ్బ. పేసర్‌‌ సీన్ అబాట్ కూడా జట్టుకు దూరమయ్యాడు. దీంతో, ఓపెనింగ్ స్థానాన్ని మ్యాట్ షార్ట్ భర్తీ చేసే అవకాశం ఉంది.అయితే, గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్ గ్లెన్ మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్ నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండటం ఆసీస్‌‌‌‌‌‌‌‌కు బలం. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా ఆడిన టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ పైనే జట్టు ప్రధానంగా ఆధారపడుతుంది.  అబాట్ స్థానంలో  లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ పేసర్ బెన్ డ్వారిషస్ అరంగేట్రం చేసే చాన్సుంది. 

పిచ్‌‌‌‌‌‌‌‌/వాతావరణం 

కరారా ఓవల్‌లో ఇది వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే జరిగాయి. బీబీఎల్‌‌‌‌‌‌‌‌లో భారీ స్కోర్లు నమోదైన నేపథ్యంలో ఈ పోరులోనూ పరుగుల వర్షం ఆశించొచ్చు. గురువారం వర్ష సూచన లేదు. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్, సూర్యకుమార్  (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ ( కీపర్), శివమ్ దూబే/హర్షిత్ రాణా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్, వరుణ్ చక్రవర్తి, జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా:
 మ్యాట్ షార్ట్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కీపర్), టిమ్ డేవిడ్, మిచ్ ఓవెన్, స్టోయినిస్, మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్, జేవియర్ బార్ట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌,  బెన్ డ్వారిషస్, నేథన్ ఎలీస్, కునెమాన్‌‌‌‌‌‌‌‌.