ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్ గా మార్చారు!..హెడ్ కానిస్టేబుల్ తో పాటు ..ఐదుగురు కానిస్టేబుళ్ల నిర్వాకం

ఎక్సైజ్ స్టేషన్ ను పేకాట క్లబ్ గా మార్చారు!..హెడ్ కానిస్టేబుల్ తో పాటు ..ఐదుగురు కానిస్టేబుళ్ల నిర్వాకం

చెన్నూరు, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ స్టేషన్ ను సిబ్బంది పేకాట క్లబ్బుగా మార్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఎక్సైజ్ స్టేషన్ ను మూసేసి  లోపల హెడ్ కానిస్టేబుల్ తో పాటు, ఐదుగురు కానిస్టేబుళ్లు పేకాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

కొన్నాళ్లుగా ఎక్సైజ్ ఆఫీసులో పేకాట ఆడుతున్న విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెడు వ్యసనాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అధికారులే ఇలాంటివాటికి పాల్పడుతుండడంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 

ఎక్సైజ్ ఆఫీసును పేకాట క్లబ్ మార్చిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఘటనపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విచారణ చేపట్టి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ హరి తెలిపారు.