అదుపుతప్పి చెరువులో పడిన ఎద్దుల బండి.. తాతా మనవడి మృతి

అదుపుతప్పి చెరువులో పడిన ఎద్దుల బండి.. తాతా మనవడి మృతి

వరంగల్ రూరల్ జిల్లా: ఆదివారం సెలవు రోజు. ఎద్దుల బండిపై హుషారుగా వెళ్తున్నారు.. చెరువు గట్టుపై అహ్లాదకరమైన వాతావరణం. కొద్ది క్షణాల్లోనే అంతా తలకిందులైపోయింది. ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఎద్దులబండిపై వెళ్తున్న తాతా మనవళ్లు ఇద్దరు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటన నడికూడ మండలం వరికోల్ గ్రామంలో జరిగింది.  గ్రామస్తులు వీరి ఆచూకీ కోసం చెరువులో గాలించారు. విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు భారీ సంఖ్యలో చెరువుగట్టుకు తరలివచ్చారు.  కాణాల సాంబయ్య (45), మనుమడు ఆర్తిక్(6) మృతదేహాలు బయటకు తీసిన సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు కంటతడిపెట్టించాయి. చూసేందుకు వచ్చిన వారు సైతం కంటతడిపెట్టుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

లారీ నిండా పండ్ల బుట్టలు.. తేడా కనిపిస్తోందని చెక్ చేస్తే..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు