భీమ్స్కు బంపర్ ఆఫర్.. మెగాస్టార్కు మాస్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ !

భీమ్స్కు బంపర్ ఆఫర్.. మెగాస్టార్కు మాస్ సాంగ్ కంపోజ్ చేసే ఛాన్స్ !

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఓ వైపు వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ తెరకెక్కుతుండగా.. మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ షూటింగ్ జరుగుతోంది. భీమ్స్‌‌‌‌ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటు భీమ్స్‌‌‌‌కు మరో మెగా ఛాన్స్‌‌‌‌ తలుపుతట్టింది. 

‘విశ్వంభర’ చిత్రంలోని ఓ పాటను భీమ్స్‌‌‌‌ చేత కంపోజ్ చేయించాలని మేకర్స్‌‌‌‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను కూడా విడుదల చేశారు. సీతారాముల కళ్యాణం నేపథ్యంలో వచ్చిన ఆ పాటకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సెకండాఫ్​లో వచ్చే ఓ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ కోసం భీమ్స్‌‌‌‌ను సంప్రదించినట్టు తాజా సమాచారం.  

ఫోక్ సాంగ్స్‌‌‌‌, భీట్ సాంగ్స్‌‌‌‌ చేయడంలో భీమ్స్‌‌‌‌కు అంటూ ఓ ప్రత్యేకత ఉంది. ధమాకా, మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి చిత్రాలకు తన మ్యూజిక్ ఎంతో ప్లస్ అయింది. ప్రస్తుతం చిరు ‌‌‌‌‌‌‌‌– అనిల్ రావిపూడి చిత్రంతో పాటు మాస్ జాతర, డెకాయిట్, టైసన్ నాయుడు లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిక ‘విశ్వంభర’లో ఓ పాట ఈ వరుసలో చేరింది. మరి ఏరికోరి మెగాస్టార్ కోసం కంపోజ్ చేయిస్తున్న ఈ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ ఎలా మేజిక్ చేయబోతోందో అనే ఆసక్తి నెలకొంది.