IND vs SA: తొలి సెషన్ సౌతాఫ్రికాదే.. టీ బ్రేక్ ముందు బుమ్రా వికెట్‌తో బిగ్ రిలీఫ్

IND vs SA: తొలి సెషన్ సౌతాఫ్రికాదే.. టీ బ్రేక్ ముందు బుమ్రా వికెట్‌తో బిగ్ రిలీఫ్

గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు తొలి రోజు తొలి సెషన్ లో విఫలమయ్యారు. టాస్ ఓడిన మన జట్టు తొలి సెషన్ ను పేలవంగా ఆరంభించింది. సౌతాఫ్రికా ఓపెనర్లు భారత బౌలర్లను తొలి సెషన్ లో సమర్ధవంతంగా అడ్డుకోవడంతో టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజ్ లో ర్యాన్ రికెల్టన్ (35) ఉన్నాడు. 38 పరుగులు చేసిన మార్కరం ఔటయ్యాడు. తొలి వికెట్ కు సఫారీ ఓపెనర్లు 82 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో బుమ్రాకు ఈ వికెట్ దక్కింది. 

రాహుల్ క్యాచ్ మిస్:

టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కొత్త బంతితో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వికెట్ రాకపోయినా  సఫారీ ఓపెనర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. బుమ్రావేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇండియాకు వికెట్ తీసుకునే అవకాశం వచ్చింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మార్కరం స్లిప్ లో ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రాహుల్ మిస్ చేశాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా ఓపెనర్లు చిన్నగా బ్యాట్ ఝుళిపించి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు. తొలి వికెట్ కు 82 పరుగులు జోడించిన తర్వాత బుమ్రా భారత్ కు తొలి వికెట్ అందించాడు. ఓపెనర్ మార్కరంను క్లీన్ బౌల్డ్ చేసి టీ విరామానికి ముందు బిగ్ బ్రేక్ ఇచ్చాడు.   

గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభమాన్ గిల్ దూరం కావడంతో స్టాండింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ భారత కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. గిల్ స్థానంలో సాయి సుదర్శన్.. అక్షర్ పటేల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లోకి వచ్చారు. మరోవైపు సౌతాఫ్రికా ఒక మార్పుతో మ్యాచ్ ఆడుతుంది. బాష్ స్థానంలో ముత్తుస్వామి జట్టులోకి వచ్చాడు. 

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్నే (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, సెనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్

భారత్ (ప్లేయింగ్ XI):

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్