న్యూజిలాండ్‌‌లో బుమ్రాకు సర్జరీ!

న్యూజిలాండ్‌‌లో బుమ్రాకు సర్జరీ!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌‌ పేసర్‌‌ జస్ప్రీత్‌‌ బుమ్రా.. బ్యాక్‌‌ ఇంజ్యురీకి న్యూజిలాండ్‌‌లో సర్జరీ చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఐదు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్న బుమ్రాను అక్టోబర్‌‌–నవంబర్​లో జరిగే వరల్డ్‌‌కప్‌‌ వరకు రెడీ చేసేందుకు బోర్డు ఈ ప్రయత్నం చేస్తోంది. జోఫ్రా ఆర్చర్‌‌ (ఇంగ్లండ్‌‌), షేన్‌‌ బాండ్‌‌ (న్యూజిలాండ్‌‌)కు సర్జరీ చేసిన డాక్టర్‌‌ రోవన్‌‌ షౌటెన్‌‌.. బుమ్రాకు చికిత్స అందించనున్నాడు.

సర్జరీ తర్వాత బుమ్రా 20 నుంచి 24 వారాల రిహాబిలిటేషన్‌‌లో ఉండనున్నాడు. దీంతో ఐపీఎల్‌‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో అతను ఆడటంపై డౌట్స్‌‌ మొదలయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌‌లో బుమ్రా.. ఆస్ట్రేలియాపై చివరి టీ20 మ్యాచ్‌‌ ఆడాడు.