న్యూ లుక్ లో సర్ ప్రైజ్ చేసిన ఐకానిక్ స్టార్ బన్నీ

న్యూ లుక్ లో సర్ ప్రైజ్ చేసిన ఐకానిక్ స్టార్ బన్నీ

ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా.. కేవలం ఒక్క సినిమాతోనే ఎక్కడలేని అభిమానాన్ని, క్రేజ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ పేరుతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు మరో కొత్త లుక్ లో అదరగొడుతున్నాడు. బ్రౌన్ షర్టు, తెల్ల జుట్టు, నోటిలో సిగరెట్టు, కళ్లద్దాలు పెట్టుకొని మాస్ అండ్ స్టైలిష్ ఫోజ్ లో కనిపిస్తున్న అల్లు అర్జున్ ని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసి పోతున్నారు. ఈ హీరో న్యూ లుక్ చూసిన తోటి నటీనటులు సైతం .. సార్.. మీరేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పుష్ప పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనంతరం బన్నీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. దీంతో పలు బ్రాండ్ లకు అంబాసిడర్ లుగా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రకటనలకు సైన్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్ డైరెక్షన్ లో పలు సంస్థల యాడ్స్ షూటింగ్స్ లో బన్నీ పాల్గొన్నట్టు సమాచారం. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇలా రింగుల జుట్టు, చెవికి పోగులతో రఫ్ లుక్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. గుర్తు పట్టలేనంతగా మారిపోయిన బన్నీని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.