పబ్లిక్ ఇబ్బందుల్లో ఉంటే పక్క రాష్ట్రంలో రాజకీయాలా?

పబ్లిక్ ఇబ్బందుల్లో ఉంటే పక్క రాష్ట్రంలో రాజకీయాలా?
  • కేసీఆర్ పై బూర నర్సయ్య ఫైర్

హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలతో పబ్లిక్  ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్  మహారాష్ర్ట రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నారని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్  విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు వరదల్లో మునుగుతుంటే పక్క రాష్ట్రంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆ నేతలను కలుస్తున్నారని మండిపడ్డారు. శనివారం పార్టీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. వరద ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించాలని, అప్పుడే అధికారులంతా పనిచేస్తారన్నారు. 

కేసీఆర్​కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఉత్తర తెలంగాణ మునిగిపోతుంటే పట్టించుకోవడం లేదన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ఖర్చు ఎంత, లాభం ఎంత, సమ్మక్క బ్యారేజీ వల్ల లాభం ఎంత, ఖర్చు ఎంత అన్న అంశాలపై వైట్​ పేపర్​ విడుదల చేయాలన్నారు.