జీడిమెట్ల, వెలుగు: తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిగుట్ట ఎన్టీఆర్నగర్కు చెందిన మహమ్మద్ఓ ప్రైవేట్ఉద్యోగి.
ఈ నెల 21న అతను డ్యూటీకి వెళ్లగా.. తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. రాత్రి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి బీరువాలో చూడగా 15 తులాల బంగారం, వెండి సామగ్రితోపాటు రూ.15 వేలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని, ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
