జనగామ జిల్లాలో ఒకేరోజు మూడు ఇళ్లలో చోరీ

జనగామ జిల్లాలో ఒకేరోజు మూడు ఇళ్లలో చోరీ

జనగామ జిల్లాలో రోజురోజూకూ దొంగల బెడద తీవ్రమైన సమస్యగా మారిపోతోంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. దీంతో పట్ణణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు ఉన్నారని తీరిగ్గా ఉందామంటే.. పోలీసుల ఇళ్లనూ దొంగలు వదలకుండా మరింత ఆందోళన సృష్టిస్తున్నారు.

జిల్లాలో ఒకే రోజు మొత్తం మూడు ఇళ్ళలో దొంగతనాలు జరిగినట్టు తెలుస్తోంది. బాలాజీ నగర్ లో తాళంవేసి ఉన్న ఇంట్లో ఏడు తులాల బంగారం దొంగిలించిన దొంగలు.. రూ.80వేల నగదును దొంగతనం చేశారు. జ్యోతి నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆరు తులాల బంగారంతో పాటు రూ.50వేల నగదును దుండగులు చోరీ చేశారు. ఇదే క్రమంలో ఓ ఎస్సై ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.