హైవేపై కాలిపోయిన కారు తప్పిన ప్రమాదం

హైవేపై కాలిపోయిన కారు తప్పిన ప్రమాదం

గుంటూరు మంగళగిరి మండలం కొలనుకొండ దగ్గర ఇవాళ(మంగళవారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఢీకొట్టిన కారులో మంటలు చెలరేగాయి.  కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు వెంటనే అలర్టయి..కారులోంచి కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది….స్ధానికుల ద్వారా విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.