
- పెద్ద ఎత్తున మంటలు, కమ్ముకున్న దట్టమైన పొగతో..
- స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి
- సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డి పేటలో ఘటన
అమీన్పూర్, వెలుగు : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మున్సిపాలిటీ కిష్టారెడ్డిపేట శ్మశానవాటికలో కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి కెమికల్డ్రమ్ములు కాల్చివేశారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. ఓఆర్ఆర్ఎగ్జిట్–4 సర్వీసు రోడ్డుకు పక్కనే కిష్టారెడ్డిపేట శ్మశాన వాటికలో నుంచి మంటలు, పొగలు కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో అటువైపు నుంచి వెళ్లే వాహనదారులు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక కొద్ది సేపు వెహికల్స్ నిలిపేశారు. కెమికల్ వాసనతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందడంతో ఫైర్ఇంజన్తో సిబ్బంది వెళ్లి మంటలను ఆర్పేశారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శ్మశాన వాటికలో కెమికల్ డ్రమ్ములను ఎవరు నిల్వ ఉంచారు. వాటిని ఎవరు కాల్చివేశారనేది తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.