
పద్మారావునగర్, వెలుగు: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలని నగర పోలీసులు సూచిస్తున్నారు. వాయు, ధ్వని కాలుష్యం తగ్గించడానికి గతంలో సుప్రీం కోర్టు గైడ్లైన్స్ప్రకటించిందని, నగర ప్రజలు వాటిని తప్పకుండా పాటించాలని ప్రకటించారు. నిర్ణీత సమయం తర్వాత పటాకులు కాల్చినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై క్రాకర్స్కాల్చి న్యూసెన్స్చేస్తే యాక్షన్తప్పదన్నారు. భారీ శబ్ధాలు వచ్చే పటాకులు కాల్చి సౌండ్ పొల్యూషన్ కు కారణం కావొద్దన్నారు.
పక్కాగా అమలు చేస్తం
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలన్న నిబంధననలు పక్కాకా అమలు చేస్తం. అతి భారీ శబ్ధాలు చేసే పటాకులు కాల్చడం నిబంధనలకు విరుద్ధం. మన సంబరాలు ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో డయల్100 కు కాల్చేయండి.
ఇన్ స్పెక్టర్ జీ. నాగరాజు, తిరుమలగిరి పీఎస్