వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

డ్రైవర్ తో సహా 24 మందికి గాయాలు

తమిళనాడులో ఘటన
న్యూఢిల్లీ: ఓ ప్రైవేట్ బస్సు వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో 25 మంది గాయపడిన ఘటన తమిళనాడులో జరిగింది. ఆదివారం తమిళనాడులోని కరూర్–సేలం నేషనల్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. లాక్ డౌన్ కారణంగా బెంగళూరులో చిక్కుపోయిన కేరళీయులను ఈ బస్సులో స్వరాష్ట్రానికి పంపిస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. రామ్ నగర్ వద్ద హైవే క్రాస్ అవుతుండగా ఎదురుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ తోపాటు 24 మంది గాయపడగా.. వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ బస్సులో ఐటీ ఎంప్లాయీస్ తోపాటు కేరళలోని కొట్టాయంకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారిని కేరళ పంపడానికి ఈ–పాస్ సౌకర్యంతో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించినప్పటి నుంచి కరూర్ జిల్లాలో అయిన తొలి యాక్సిడెంట్ ఇదేనని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.