ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

 

  • 100 మంది ప్రయాణికులు సేఫ్

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కోస్గి డిపోకు చెందిన బస్సు గురువారం హైదరాబాద్ నుంచి కోస్గి వైపు వెళ్తోంది. మండలంలోని మీర్జా గూడలో సమీపంలోకి రాగానే, బస్సు కమాన్ పట్టీలు విరిగి పోవడంతో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వారిని అంబులెన్స్​లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాలం చెల్లిన బస్సులు ఉండడం, వాటికి సరైన సమయంలో రిపేర్లు చేయకపోవడంతో తరచూ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.