
విశాఖలో ఘోర ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు తగలబడింది. ఈ రోజు ( ఆగస్టు 29) ఉదయం కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ డ్రైవర్ వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను దింపేశాడు.
అందరూ చూస్తుండగానే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.