
శంషాబాద్ ఎయిర్పోర్టు రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆటో ను బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఒకరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే శంషాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
ఈ ప్రమాదంలో రమావత్ లక్ష్మణ్ (45)అనే వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మన్ నల్గొండ జిల్లా చెన్నంపేట మండలం గువ్వాళ గుట్ట గ్రామనికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడ్డ వారిని శంషాబాద్ సన్ రైస్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. హనుమంతు (33) పరిస్థితి మరీ సీరియస్ గా ఉందని.. వెంకటమ్మ (34) విజయ (24) విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మిగతా ఆరు మందికి స్వల్ప గాయాలైనట్టు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.