ఢిల్లీ నుంచి లండ‌న్ కు బ‌స్సు స‌ర్వీసు

ఢిల్లీ నుంచి లండ‌న్ కు బ‌స్సు స‌ర్వీసు

సాహ‌స యాత్ర‌లు ఇష్ట‌ప‌డే వారికి అడ్వెంచ‌ర్స్ ఓవ‌‌ర్ ల్యాండ్ అనే కంపెనీ ఓ అవ‌కాశం క‌ల్పించింది. 2021 మే నుంచి ఢిల్లీ టు లండ‌న్ బ‌స్సు స‌ర్వీసు ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ బ‌స్సు 70 రోజుల్లో 18 దేశాల మీదుగా 20 వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌నుంది. మ‌య‌న్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, క‌జ‌క్ స్థాన్, లాత్వియా, లిథుయేనియా, ర‌ష్యా, పోలాండ్, చెక్ రిప‌బ్లిక్,జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ ఇలా 18 దేశాల మీదుగా యూకేలోని లండ‌న్ కు చేరుకోనుంది.

ఇరవై సీట్ల సామర్ధ్యముండే ఈ ప్రత్యేక బస్సులో… నలుగురు సిబ్బంది ఉంటారు. ఇక… మరో విశేషమేమిటంటే… ప్రయాణికులకు వీసా ఏర్పాట్లను కూడా ఈ బస్సును నిర్వహించే సంస్థే చూసుకుంటుంది. టికెట్ ధ‌ర ఒక్క‌రికి రూ.15 ల‌క్ష‌లు అని తెలిపింది సంస్థ‌. టిక్కెట్ ధరను పక్కన పెడితే… భారత్ నుంచి అన్ని దేశాల మీదుగా ప్రయాణించి లండన్ కు చేరుకోవడమంటే ఉత్కంఠగా ఉందంటున్నారు టూరిస్టులు.