రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు

రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు

రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ వల్ల బస్సులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్ పరిధిలో మాత్రం సిటీ బస్సులు నడపబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ.. హైదరాబాద్ లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులను నడపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు బస్సు సర్వీసులు నడపనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్టీసీ బస్సులను శానిటైజ్ చేసి.. డ్రైవర్లు, కండక్టర్లు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.

For More News..

నియంత్రిత పంటల విధానం పాటించాలి: సీఎం కేసీఆర్

అభిమానులకు జూ. ఎన్టీఆర్ లేఖ

సోదరునితో అక్రమసంబంధం అంటగట్టిన పోలీసులు