వ్యాపారం ఇక్కడ ఈజీ .. వేరే రాష్ట్రాలకు వెళ్లక్కర్లేదు

వ్యాపారం ఇక్కడ ఈజీ .. వేరే రాష్ట్రాలకు వెళ్లక్కర్లేదు
  • జాన్సన్​ ఇన్నోవేషన్ సెంటర్​​ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేవారికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండదండలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. మానుఫ్యాక్చరింగ్​ యూనిట్లను ఏర్పాటు చేస్తూ, ఉపాధి కల్పిస్తున్న సంస్థలకు వీలైనంత చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు.   సులువుగా వ్యాపారం చేసుకునేందుకు రూల్స్​ను ఈజీ చేశామని, ఎన్నో పాలసీలు తెచ్చామని వివరించారు. అందుకే సిటీ ఇన్వెస్ట్​మెంట్లకు అడ్రస్​గా మారిందని కామెంట్ చేశారు. హైదరాబాద్​లో మంగళవారం జాన్సన్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌బ్లూ ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను  ప్రారంభించాక మంత్రి మాట్లాడుతూ.. మనదేశంలో తగినంత టాలెంట్​ ఉందని అన్నారు.  

మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌..

‘‘కంపెనీలు పెట్టుబడుల కోసం దేశంలోని మరే రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదు. మేం వాటికి అన్ని విధాలా అండదండలను అందిస్తున్నాం. జాన్సన్‌‌‌‌‌‌‌‌ సంస్థ పదేళ్లుగా హైదరాబాద్​లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆపరేషన్స్​ను విస్తరించడం సంతోషకరమైన విషయం. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎంతలా అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో సంస్థలకు బాగా తెలుసు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ టీ-హబ్‌‌‌‌‌‌‌‌, టీ-సెల్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయి. ఇమేజ్‌‌‌‌‌‌‌‌ టవర్స్‌‌‌‌‌‌‌‌, ప్రపంచ స్థాయి కమాండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తున్నాం. మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ రంగానికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా మారబోతున్నది”అని కేటీఆర్ వివరించారు.   ఈ కార్యక్రమంలో జాన్సన్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్స్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌  వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌  జనరల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ డేవ్‌‌‌‌‌‌‌‌ పుల్లింగ్‌‌‌‌‌‌‌‌ , జాన్సన్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్స్‌‌‌‌‌‌‌‌  ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ వీపీ గోపాల్‌‌‌‌‌‌‌‌ పారిపల్లి,  జాన్సన్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్స్‌‌‌‌‌‌‌‌  ఇంట్రూజన్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, తజ్మిన్‌‌‌‌‌‌‌‌ పిరానీ పాల్గొన్నారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీ వద్దనున్న  గౌర ఫౌంటెన్‌‌‌‌‌‌‌‌హెడ్‌‌‌‌‌‌‌‌ వద్ద ఈ సెంటర్​ను ఏర్పాటు చేశారు.