
ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులోని నిందితులను కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. నాంపల్లి కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో.. చంచల్ గూడ జైలులో ఉన్న కోగంటి సత్యం, అతని అనుచరులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకోనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంపై వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు 21 కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.