మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్‌‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్‌‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు: వరంగల్‌‌ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్‌‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. మీల్స్‌‌ కాలనీ సీఐ బొల్లం రమేశ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న రాత్రి 11.30 గంటలకు ఎస్సై శ్రీకాంత్‌‌, కానిస్టేబుల్‌‌ రాజు పెట్రోలింగ్‌‌కు వెళ్తుండగా.. వాల్‌‌మార్ట్‌‌ ఎదురుగా ఉన్న రెడ్‌‌ బకెట్‌‌ బిర్యానీ షాపు ఓపెన్‌‌ చేసి ఉంది. దీంతో ఎస్సై, కానిస్ట్‌‌బులు షాప్‌‌ను మూసివేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మరో అరగంట తర్వాత తిరిగి వచ్చే సరికి కూడా షాప్‌‌ ఓపెన్‌‌ చేసే ఉండడంతో ఎస్సై సిలిండర్‌‌ తీసే ప్రయత్నం చేయడంతో నిర్వాహకురాలు మరియమ్మ అడ్డుకుంది. ఈ మేరకు ఎస్సై ఫిర్యాదుతో మరియమ్మ ఆమె కుమారుడు శేఖర్‌‌పై కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సై తమపై దాడి చేశాడని మరియమ్మ, ఆమె కుమారుడు సైతం ఫిర్యాదు చేయడంతో ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.