
టూరిస్టులకు, ట్రావెలర్స్ కి పర్యాటక ప్రదేశాలు ఓ స్వర్గంలాంటిది. ఎందుకంటే పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రతీ ఒక్కరూ ప్రశాంతమైన సమయం గడిపేందుకు చూస్తుంటారు. ఎందుకంటే ప్రతిరోజు ఉండే ఉరుకుల పరుగుల జీవితంలో కొంత మనశాంతి కోరుకుంటారు కాబట్టి. అయితే పర్యాటక ప్రదేశాలు అనగానే గుర్తొచ్చే కొన్ని ప్రముఖ ప్రదేశాలలో మలేషియా కూడా ఒకటి. ఇక్కడి వాతావరం, పర్యాటక ప్రదేశాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అయితే మలేషియా లాంటి దేశంలో మీరు కూడా శాశ్వతంగా ఉండొచ్చు... కానీ ఇందుకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి...
మలేషియా శాశ్వత నివాసి లేదా పర్మనెంట్ రెసిడెంట్ (PR) అంటే ఏంటి : మలేషియా శాశ్వత నివాసి (PR) అంటే ఒక వ్యక్తి ఆ దేశంలో ఎప్పటికి ఉండొచ్చు, పని/ జాబ్ చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు. మలేషియా పౌరులకు ఉండే ఓటు హక్కు తప్ప మిగతా అన్ని హక్కులు ఉంటాయి. PR ఉన్నవారు ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యాపార అవకాశాలు వంటి అన్నిట్లో స్థానికులతో సమాన హక్కు ఉంటుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: మలేషియా PR కావాలంటే కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. మొదట మీరు మలేషియాలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్న ఉద్యోగి అయితే మీరు అర్హులు. అలాగే భారతీయులతో సహా విదేశీయులు మలేషియా బ్యాంకులో కనీసం 5 సంవత్సరాలు USD 2 మిలియన్లు (దాదాపు రూ. 17.5 కోట్లు) డిపాజిట్ చేసి PR కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతేకాదు సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ లేదా ఆర్ట్స్ వంటి రంగాలలో టాలెంట్ ఉన్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు మలేషియా పౌరులను పెళ్లి చేసుకొని అదే దేశంలో 5 సంవత్సరాలు ఉంటే కూడా PR కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ PR అప్లికేషన్స్ ప్రక్రియను చూసుకుంటుంది. ఇందుకు ముందుగా మీకు ఏ వర్గం కింద అర్హత ఉందొ తెలుసుకోవాలి. తరువాత దరఖాస్తు ఫామ్ తో పాటు పాస్‌పోర్ట్ ఫోటోలు, ఉద్యోగం లేదా పెట్టుబడి ఆధారాలు, పెళ్లి సర్టిఫికేట్ వంటి ఉండాలి.
ఒకోసారి కొన్ని సందర్భాల్లో మలేషియా మంత్రిత్వ శాఖ నుండి సిఫార్సు లేఖ అవసరం కావొచ్చు. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ హెడ్ ఆఫీస్ లేదా రాష్ట్ర ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో మీ దరఖాస్తు సబ్మిట్ చేయాలి. దీనికి RM 500 అంటే దాదాపు రూ. 10,400 ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. అయితే దరఖాస్తు ఆమోదం కోసం 2-5 సంవత్సరాలు పట్టవచ్చు. ఆమోదించిన తర్వాత మీరు RM 1,500 అంటే దాదాపు రూ. 31,200 ఎంట్రీ ఫీజు కట్టాలి. కట్టిన తర్వాత మీరు మీ బ్లూ ఐడెంటిఫికేషన్ కార్డ్ (MyPR కార్డ్) ఇస్తారు. ఇదే మీ పర్మనెంట్ రెసిడెంట్ గుర్తింపు.
My Second Home (MM2H) ప్రోగ్రామ్: మలేషియాలో సెటిల్ అవడానికి MM2H మరొక మార్గం. దీని ద్వారా నేరుగా PR కాదు కానీ దీని ద్వారా 10 సంవత్సరాలు ఆ దేశంలో ఉండవచ్చు.