
బషీర్బాగ్, వెలుగు: పొలిటీషియన్స్ జేఏసీ నేషనల్వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్ ఇంద్రపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్మాట్లాడుతూ.. మంచి వ్యక్తిత్వం ఉన్నవారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం లేదన్నారు.
ప్రజలకు మంచి చేసే తత్వం ఉన్నవారిని రాజకీయ క్షేత్రంలో ఎదగడానికి తమ జేఏసీ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. త్వరలో జేఏసీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, ప్రజలను మోసం చేసే రాజకీయ పార్టీల తీరును ఎండగడతామని పేర్కొన్నారు. కమిటీ సభ్యులుగా కుల్లపరెడ్డి సురేశ్ బాబు, కూనపరెడ్డి హరిప్రసాద్, సింగం శ్రీనివాసరావు, దమ్మిగారి కనకయ్యను ఎన్నుకున్నారు.