
సిద్దిపేట, వెలుగు: డెంగ్యూ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, సీజనల్‌వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌మండలం తిమ్మాపూర్‌లో డెంగ్యూతో చనిపోయిన మహేశ్, శ్రవణ్‌కుమార్ ఫ్యామిలీలను ఆదివారం ఆయన పరామర్శిచారు. అనంతరం మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహేశ్, శ్రావణ్ చనిపోయారన్నారు.
తిమ్మాపూర్ గ్రామంలో సుమారు 60 ఫ్యామిలీలు డెంగ్యూతో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారన్నారు. గ్రామపంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బుల లేవని, చెత్త సేకరణ చేసే దిక్కు కూడా లేకుండా పోయిందన్నారు. రోజు రోజుకు పరిస్థితి చేయిదాటుతున్నా సీఎం ఒక్కసారి కూడా రివ్యూ చేయడంలేదన్నారు. విషజ్వరాల బారిన పడి ప్రజలు అప్పుల పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు.
గ్రామ పంచాయతీల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, ఓ వైపు యూరియా కొరత ఏర్పడుతుంటే.. మరో వైపు బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఫుల్‌గా అమ్ముతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విషజ్వరాల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అమరనాథ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.