సుప్రీంకోర్టులో సైరస్ మిస్త్రీకు షాక్

సుప్రీంకోర్టులో సైరస్ మిస్త్రీకు షాక్

న్యూఢిల్లీ : సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కనీసం పరిశీలన కూడా చేయకుండా కొట్టేయడాన్ని వ్యాపార దిగ్గజం రతన్‌ టాటా స్వాగతించారు. 

గతంలో తనను టాటా చైర్మన్‌గా తొలగిస్తూ టాటా సన్స్‌ తీసుకున్న నిర్ణయంపై మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది టాటా సన్స్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సైరస్ మిస్త్రీకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ తాజాగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. గురువారం (ఈనెల 19న) ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీం తీర్పుపై రతన్ టాటా స్పందించారు. ఇది మన న్యాయవ్యవస్థ యొక్క విలువ, నైతికతను బలపరుస్తుంది అంటూ ట్వీట్‌ చేశారు. 

అసలేం జరిగిందంటే..
2016, అక్టోబర్‌లో నాటకీయ పరిణామాల మధ్య టాటా సన్స్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు. గత ఏడాది మార్చిలో సైరస్ మిస్త్రీ తొలగింపును అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది. 

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది