రాత్రి 8 గంటల వరకు షాపులు ఓపెన్

రాత్రి 8 గంటల వరకు షాపులు ఓపెన్

హైదరాబాద్ , వెలుగులాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్​లైన్స్​ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. రాష్ట్రమంతా ఈ నెల 7 వరకు లాక్​డౌన్​ అమలులో ఉంటుందని చెప్పారు. కంటెయిన్​మెంట్​ జోన్లలో మాత్రం ఈ నెల 30 వరకూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. షాపులను, ఇతర వ్యాపారాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఓపెన్​ చేసి ఉంచాలన్నారు. హాస్పిటళ్లు, మెడికల్​ షాపులకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్​ లేవని చెప్పారు.  ఆదివారం కేసీఆర్​ ఫాం హౌస్​ నుంచి ఫోన్​లో సీఎస్  సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో కేంద్ర గైడ్​లైన్స్​పై చర్చించారు. కంటెయిన్​మెంట్​ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రమంతా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ  ఉంటుందన్నారు. మెడికల్​ సర్వీసులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. రాష్ట్రాల మధ్య రాకపోకలకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్  అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు లాక్​డౌన్​ సడలింపులపై  సీఎస్​ జీవో జారీ చేశారు.

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు