
తమిళనాడులో దారుణం జరిగింది. కుళ్లిపోయిన స్థితిలో ఒక వ్యాపారవేత్త డెడ్ బాడీ లభ్యమైంది. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని వరదరాజపురంలో నివాసం ఉంటున్న సెల్వకుమార్ అనే వ్యక్తి వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇంటినుంచి ఓ రోజు ఉదయం బయటకు వెళ్లిన సెల్వ తిరిగి రాకపోవడంతో భార్య అనుమానించింది. రెండు రోజుల అయినా భర్త నుంచి సమాచారం లేకపోవడంతో జనవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
మంగళవారం, తమిళనాడులోని కుండ్రత్తూరు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో నుంచి దుర్వాసన రావడం పక్కనే వెళ్తున్న వారు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అద్ధం పగలగొట్టి కారు డోర్ తెరిచి చూశారు. అందులో కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహాం కనిపించంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాడీ సెల్వదిగా గుర్తించారు.
డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సెల్వకుమార్ ఓ కిరాణ కొట్టులో జనవరి 12న వాటర్ బాటిళ్లు కొన్నాడని గుర్తించారు. అప్పులు పెరిగిపోవడంతో అతడు మనస్తాపానికి గురయై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.