పోలీసుల రెయిడ్‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ మృతి

పోలీసుల రెయిడ్‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌మెన్ మృతి
  • యూపీలో ఆరుగురు పోలీసుల సస్పెన్షన్​.. మర్డర్ కేసు నమోదు

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో దారుణం జరిగింది. పోలీసుల రెయిడ్‌‌‌‌‌‌‌‌లో ఒక బిజినెస్ మెన్ చనిపోయాడు. సోమవారం అర్ధరాత్రి సిటీలోని ఓ హోటల్ లో ఈ ఘటన జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. పోలీసులపై చర్యలు తీసుకుంది. ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వారిపై మర్డర్ కేసు నమోదు చేసింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. 

అసలేం జరిగింది? 

కాన్పూర్​కు చెందిన మనీశ్ కుమార్ గుప్తా, మరో ఇద్దరు బిజినెస్ పార్టనర్లు. వీరు ముగ్గురు మరో ఫ్రెండ్ ను కలిసేందుకు గోరఖ్ పూర్ కు వెళ్లి హోటల్ లో ఉన్నారు. ‘‘సోమవారం అర్ధరాత్రి 12:30 గంటల టైమ్ లో 57 మంది పోలీసులు మా రూమ్ కు వచ్చారు. మా ఐడీలు చూపించాలని అడిగారు. నేను నా ఐడీ చూపించి, మనీశ్ ను నిద్ర లేపాను. ఈ టైమ్ లో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని పోలీసులను మనీశ్ అడిగాడు. దీంతో వాళ్లు మమ్మల్ని బెదిరించారు. వాళ్లు తాగి వచ్చినట్టు అనిపించింది. కొంతమంది చేతిలో గన్స్ ఉన్నాయి. ఒకతను నన్ను కొట్టాడు. తర్వాత నన్ను బయటకు తీసుకెళ్లారు. కొంత సమయం తర్వాత మనీశ్ ను పోలీసులు రూమ్ నుంచి లాక్కొని వచ్చారు. అతని ముఖం మీద మొత్తం రక్తం ఉంది” అని హర్యానాలోని గుర్గావ్ కు చెందిన హర్వీర్ సింగ్ చెప్పారు. 

నా భర్త ఎలా చనిపోయాడు..?   

‘‘నా భర్త చనిపోయే కంటే పది నిమిషాల ముందే నాతో మాట్లాడారు. పోలీసులు వచ్చారని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత ఆయన మరో బంధువుకు ఫోన్ చేశారు. పోలీసులు వేధిస్తున్నారని, స్టేషన్​కు రావాలని బెదిరిస్తున్నారని చెప్పారు. నా భర్త ఎలా చనిపోయాడో నాకు చెప్పండి” అని మీనాక్షి గుప్తా అడిగారు. కాగా, ముగ్గురు అనుమానితులు హోటల్ లో ఉన్నారని సమాచారం రావడంతో రెయిడ్‌‌‌‌‌‌‌‌ చేశామని.. అక్కడ రూమ్ లో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో మనీశ్ చనిపోయాడని పోలీసులు చెప్పారు.