
భువనగిరి ఎంపీ బూర యాదాద్రి, వెలుగు: కాం గ్రెస్, టీడీపీ వల్ల సాధ్యం కాని ఎయిమ్స్‌ను నాలుగేళ్లలో
సాధిం చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‍లో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణా రెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‍రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ ఎయిమ్స్ ప్రారంభమైతే ప్రజలకు వైద్య సేవలు అందుతాయన్నారు.‘పిలా యిపల్లి’కి వారం రోజుల్లో నీరు పిలాయిపల్లి కాల్వకు వారం రోజుల్లో నీళ్లు వదులుతామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. సోమవారం భూదాన్ పోచంపల్లి మండలం జగత్ పల్లిలో జరుగుతు న్న కాల్వ వెడల్పు పనులను ఆయన పరిశీలిం చారు.