వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను రీలాంచ్ చేసిన దివీస్ ఫౌండేషన్

వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ను రీలాంచ్ చేసిన దివీస్ ఫౌండేషన్

ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి బాల్యం నుంచే ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దివీస్ ఫౌండేషన్ ముందడుగు వేసింది. అందులో భాగంగా గతంలో ఫెర్నాండేజ్ సంస్థ ఆధ్వర్యంలో ఉండే వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ (VCDC)ను దివీస్  సంస్థ రీలాంచ్ చేసింది.   ఆదివారం (అక్టోబర్ 12) హైదరాబాద్ లో దివీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ డా.మురళి దివి వర్ణం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. 

గత పదేళ్లుగా దివీస్ ఫౌండేషన్ సాధించిన విజయాలను చైర్మన్ మురళి దివి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  పిల్లల సంరక్షణ, ఎదుగుదల, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పిల్లలలో ఉన్న సృజనాత్మకత (క్రియేటివిటీ), సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

DFGC విలువలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తుందని చైర్మన్ మురళి దివి తెలిపారు. ఈరోజు సంస్థ ప్రోగ్రెస్ లో ఉండటానికి కారణం పట్టుదల, సమిష్టి కృషి వల్లేనని తెలిపారు. ప్రతి చిన్నారి మానసిక అభివృద్ధికి తోడ్పడేలా ఎంతో మందిని తీర్చిదిద్దేలా సంస్థ కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చిన్నారుల జీవితంలో వెలుగులు నింపేలా సంస్థ పరిణామం చెందడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

DFGC మేనేజింగ్ ట్రస్టీ నీలిమ దివి కొత్త లోగోను ఆవిష్కరించారు. దివీస్ ఫౌండేషన్ లెగసీని కొనసాగిస్తామని తెలిపారు. ప్రతి చిన్నారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి మానసిక పరివర్తన కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. వర్ణం చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్ స్వర్ణలతా దివి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలిపారు. 

DFGC ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమోద్ గడ్డం మాట్లాడుతూ, కొత్త ఆఫీస్ ప్రారంభించడమంటే.. సమగ్ర శిక్షణ ఇచ్చి, ప్రతి చిన్నారికీ బంగారు భవిష్యత్తును అందించే ఒక వ్యవస్థను నిర్మించడం అని తెలిపారు.

►ALSO READ | 15 ఫ్లాట్లు.. 43 ఓట్లు.. అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్ ఆరోపణలపై అధికారుల క్లారిటీ

గతంలో ఫెర్నాండెజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఇప్పుడు వర్ణంగా DFGC ఆధ్వర్యంలో కొనసాగుతుందని.. ప్రతి చిన్నారి తమ స్కిల్స్ తో ముందుకు సాగేందుకు దోహదపడాలనే లక్ష్యంతో DFGC ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. 

ఆటిజం అంటే..

పిల్లల్లో వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోవడమే ఆటిజం. ఇది చాలా అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్.  దీన్ని ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌‌‌‌డీ) అని కూడా పిలుస్తారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2025 ప్రకారం మన దేశంలోని ప్రతి లక్ష మందిలో దాదాపు 715 మంది ఆటిజం బారిన పడుతున్నారు. ఆటిజం ఉన్న పిల్లల్లో  మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయదు. అందువల్ల వాళ్లు మామూలు పిల్లలతో పోలిస్తే కొన్ని విషయాల్లో వెనకబడిపోతారు. ఆ క్రమంలో సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ఆటిజం లక్షణాలు రెండు నుంచి మూడేళ్ల వయసులోనేకనిపిస్తాయి. 

ఆ టైంలోనే పేరెంట్స్‌‌‌‌ దీన్ని గుర్తించి సరైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తే సమస్య నుంచి బయటపడేయొచ్చు. అంతేకాదు.. ఒక మనిషిలో లోపం ఉంటే ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కూడా ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి సపోర్ట్‌‌‌‌ చేస్తే వాళ్లు కూడా రాణిస్తారు.