
మునగాల: సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్ చెరువులోకి దూసుకెళ్లింది. మునగాల మండలం నేలమర్రిలో ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చెరువు కట్టపై ఉన్న చెట్టు అడ్డుపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు, డ్రైవర్ ఉన్నారు. స్థానికుల సహాయంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
చివ్వెంల మండలం వల్లభాపురంలోని సెయింట్ పోల్స్ స్కూల్ బస్సుగా స్థానికులు గుర్తించారు. పిల్లలను స్కూల్‌కు పంపేటప్పుడు తల్లిదండ్రులు వసతులను పరిశీలించడంతోపాటు బస్సు ఫిట్నెస్, అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఉన్నాడా.. విద్యాబోధన ఎలా ఉంటుంది.. తదితర అంశాలను చూసుకోవాలి. ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కొందరు ట్రాన్స్పోర్ట్అధికారులు లంచాలు తీసుకుని ఫిట్నెస్ లేని బస్సులకు పర్మిషన్లు ఇస్తున్నారు.
నిబంధనలు..
* 15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులను వాడొద్దు. పసుపు కలర్ బస్‌లను మాత్రమే నడిపించాలి.
* 60 ఏండ్లలోపు వయస్సు ఉండి, ఐదేండ్ల అనుభవం ఉన్న డ్రైవర్‌ను అపాయింట్‌చేయాలి. ప్రతి మూడు నెలలకోసారి డ్రైవర్లకు కంటి పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు చేయించి రిపోర్టులు ఫైల్ చేసి పెట్టాలి.
* బస్‌లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మస్ట్‌గా ఉండాలి. ప్రతి బస్‌పై స్కూల్‌పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ బ్లాక్ పెయింట్‌తో రాయాలి. డ్రైవర్‌తో పాటు క్లీనర్ ఉండాలి.
* బస్‌లోపలి భాగం అంతా డ్రైవర్‌కు కనబడేలా పెద్ద సైజ్ మిర్రర్స్ బిగించాలి. సైడ్ మిర్రర్లు లేకుండా బస్సును బయటకు తీయొద్దు. ఫైర్ యాక్సిడెంట్ నివారణ పరికరాలు ఉండాలి.
* బుక్స్‌పెట్టుకోడానికి అరలు బిగించాలి. సీట్ల పరిమితికి మించి స్టూడెంట్స్ను ఎక్కించవద్దు.
►ALSO READ | మా నాన్నను చంపేసి భూమి లాక్కున్నారు: ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన