Rohit Sharma: అవార్డు నేలపై పెట్టడం ఏంటి అయ్యర్.. రోహిత్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

Rohit Sharma: అవార్డు నేలపై పెట్టడం ఏంటి అయ్యర్.. రోహిత్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్ తో ఆకట్టుకున్నాడు. ట్రోఫీ, అవార్డు పట్ల తనకున్న గౌరవాన్ని ప్రదర్శించాడు. ఆదివారం (అక్టోబర్ 12) 2025 సియట్ క్రికెట్ అవార్డుల సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసినందుకు గాను శ్రేయాస్ అయ్యర్ కు అవార్డు లభించింది. అవార్డు అందుకున్న తర్వాత శ్రేయాస్ ఆ ట్రోఫీని నేలపై పెట్టాడు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. అయ్యర్ కు వచ్చిన అవార్డును తీసుకొని టేబుల్‌పై పెట్టాడు. రోహిత్ చేసిన ఈ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

రోహిత్ కు అవార్డుల విలువ తెలుసు కాబట్టే ట్రోఫీని తీసుకొని టేబుల్ పై ఉంచాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంత మంది హిట్ మ్యాన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. శ్రేయాస్ పై విమర్శలు రాకపోయినా.. రోహిత్ పై ప్రశంసలు మాత్రం వస్తున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనకు గాను శ్రేయాస్ అయ్యర్ కు ఈ అవార్డు లభించింది. ఈ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. శ్రేయాస్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులతో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత దాదాపు 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు.  న్యూజిలాండ్‌‌‌‌తో జరిగిన చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ ఫైనల్‌‌‌‌ తర్వాత రోహిత్‌‌‌‌ మళ్లీ బరిలోకి దిగలేదు. ఇప్పటికే టెస్ట్‌‌‌‌, టీ20లకు గుడ్‌‌‌‌బై చెప్పిన రోహిత్‌‌‌‌ వన్డే కెరీర్‌‌‌‌ను సెలెక్టర్లు  నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్‌‌‌‌ కోహ్లీతో పాటు రోహిత్‌‌‌‌ను ఆసీస్‌‌‌‌తో వన్డే సిరీస్‌‌‌‌కు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌ నేపథ్యంలో రోహిత్‌‌‌‌ శర్మ ప్రాక్టీస్‌‌‌‌ ముమ్మరం చేశాడు. శుక్రవారం శివాజీ పార్క్‌‌‌‌లో ఇండియా మాజీ కోచ్, తన ఫ్రెండ్ అభిషేక్‌‌‌‌ శర్మతో కలిసి రెండు గంటల పాటు చెమటోడ్చాడు. 

ALSO READ : జైశ్వాల్‌కు కాలికి బంతి విసిరిన విండీస్ పేసర్.. 

ముంబై క్రికెటర్‌‌‌‌ అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువంశీతో పాటు కొంత మంది లోకల్‌‌‌‌ ప్లేయర్లు కూడా ఈ సెషన్‌‌‌‌లో పాల్గొన్నారు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించి యువ బ్యాటర్ శుభమాన్ గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించారు. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ కు వన్డే వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా మూడు వన్డేల సిరీస్ కు గిల్ కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.