‌ఆన్‌‌లైన్‌‌లో డీజిల్, పెట్రోల్‌‌.. ఆర్డరిస్తే ఇంటికొస్తయ్

‌ఆన్‌‌లైన్‌‌లో డీజిల్, పెట్రోల్‌‌.. ఆర్డరిస్తే ఇంటికొస్తయ్

న్యూఢిల్లీ: స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌‌ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్‌‌ చేస్తున్నట్టే.. పెట్రోల్‌‌, డీజిల్‌‌ను కూడా ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్‌‌‌‌ చేయొచ్చు. ఆర్డర్‌‌‌‌ ఇచ్చిన రోజే అవి మీ ఇంటికి లేదా ఆఫీస్‌‌కి వస్తాయి. ఇండియన్ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌(ఐఓసీ) ఇందుకోసం ఢిల్లీలో పెప్‌‌ఫ్యూయల్స్‌‌, పుణేకి చెందిన రెపోస్‌‌ ఎనర్జీ స్టార్టప్‌లతో టై అప్‌‌ అయ్యింది. ఫ్యూయల్‌‌ను మొబైల్‌‌ డిస్పెన్సర్ల ద్వారా డెలివరీ చేయడానికి ఈ రెండు స్టార్టప్‌‌లకు అనుమతిచ్చింది. వాహనాలు,  జనరేటర్‌‌ సెట్స్‌‌, మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్‌‌ వంటి వాటి అవసరాల కోసం డీజిల్‌‌ను ఇంటి ముందుకే తీసుకొస్తామని పెప్‌‌ఫ్యూయల్స్‌‌ హామీ ఇస్తోంది. ఈ స్టార్టప్‌‌ ఢిల్లీ-లో పనిచేస్తోంది. ఆర్డర్లను కంపెనీ యాప్‌‌ లేదా వెబ్‌‌సైట్‌‌ ద్వారా ఇవ్వొచ్చు.

డెలివరీకి నామమాత్రం చార్జీలను వసూలు చేస్తారు. ఐఓటీ ద్వారా పనిచేసే ఫ్యూయల్ డిస్పెన్సర్లపై తమకు పేటెంట్‌‌ ఉందని పెప్‌‌ఫ్యూయల్స్‌‌ పౌండర్ టికేంద్ర యాదవ్‌‌ అన్నారు. డిస్పెన్సింగ్ యూనిట్‌‌ను క్లౌడ్‌‌ ఆధారిత ప్లాట్‌‌ఫాం ద్వారా నియంత్రిస్తామని అన్నారు. అందువలన వృథా జరగడం, ఇతర ఆందోళనలు పడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని నెలల క్రితం ఈ స్టార్టప్‌‌, ఐఓసీతో అగ్రిమెంట్‌‌ను కుదుర్చుకుంది. మరోవైపు పుణేకు చెందిన రెపోస్‌‌ స్టార్టప్‌‌ కూడా డీజిల్‌‌ను డోర్‌‌‌‌స్టెప్‌‌ డెలివరీ చేయడానికి ఐఓసీతో అగ్రిమెంట్‌‌ కుదుర్చుకుంది. ఈ స్టార్టప్‌‌ పుణే, చెన్నై, బెంగళూరు, వారణాసి, రాయ్‌‌గఢ్‌‌లో తన సేవలను అందిస్తోంది. ఈ సిటీలలోని వినియోగదారులు, రెపోస్ యాప్‌‌ ద్వారా డీజిల్‌‌ను ఆర్డర్‌‌‌‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆర్డర్‌‌‌‌ను మొబైల్ డిస్పెన్సర్, ఆరువేల లీటర్ల ప్యూయల్‌‌ ట్యాంక్‌‌తో డెలివరీ చేస్తామని వివరించింది. రెపోస్‌‌ యాప్‌‌ ద్వారా మినిమమ్‌‌ 200 లీటర్ల ఆర్డర్‌‌‌‌ను పెట్టాలని ఇండియన్ ఆయిల్‌‌ కార్పొరేషన్‌‌ తెలిపింది. ఒక సారి కస్టమర్‌‌‌‌ తమ ఆర్డర్‌‌‌‌ను పెట్టిన తర్వాత, అతని పూర్తి డిటైల్స్‌‌(పేరు, మొబైల్‌‌ నెంబరు, ఎంత క్వాంటిటీ కావాలి, అడ్రస్‌‌, టైమ్‌‌ ఆఫ్‌‌ డెలివరీ) సంబంధిత ఐఓసీ డీలర్‌‌కు అందుతాయి. కస్టమర్‌‌‌‌ నుంచి ఆర్డర్‌‌ అందిన తర్వాత మొబైల్‌‌ డిస్పెన్సర్‌‌‌‌ ప్యూయల్‌‌ డెలివరీని చేస్తుంది.