
హైదరాబాద్, వెలుగు: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు మంగళవారం సిటీలో సందడి చేశారు. రెండు ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొని అభిమానులను కలుసుకున్నారు. కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లోని ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్' షోరూమ్‌లో హెన్రిచ్ క్లాసెన్, నటరాజన్, నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, జైదేవ్ ఉనాద్కత్ అభిమానులతో ఆత్మీయంగా మాట్లాడారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. అనంతరం క్రికెటర్లు షాపింగ్ చేశారు. ప్లేయర్లతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని జ్యోతి వాలెన్సియా మాల్‌లో లగ్జరీ ఐవేర్ హెల్వెటికా బొటిక్‌ను ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రారంభించాడు.