
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో 8 అసెంబ్లీ స్థానాలకు బైఎలక్షన్స్ జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 13 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు పోటీ చేశారు. వీరిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఎంపీలుగా విజయం సాదించారు. దాంతో ఖాళీ అయిన 8 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో బైఎల క్షన్స్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదే శ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గాను..సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) 37 స్థానాలను, దాని మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 33 సీట్లు గెలుచు కోగా, దాని మిత్రపక్షాలైన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ), అప్నా దళ్ (సోనేలాల్) వరుసగా 2, ఒక సీటు గెలుచుకున్నాయి.ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఒక నియోజకవర్గం (నాగీనా) గెలుచుకుంది.