మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో స్టేషన్

మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో స్టేషన్

అది ఓ మహిళా జైలు.. అయితే నేం.. అక్కడ ఎఫ్​ ఎం రేడియో మోత మోగిపోద్ది.  ముంబై బైకుల్లా మహిళా జైల్లో ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు జైళ్ల మహారాష్ట్ర జైళ్ల శాఖ శ్రీకారం చుట్టింది.  ఖైదీల్లో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా  జైలు ఆవరణలో ఎఫ్​రేడియో సెంటర్​ను మహారాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్ అమితాబ్ గుప్తా  ప్రారంభించారు.   ఆతరువాత శ్రద్దా చౌగులే అనే ఖైదీ గుప్తాను ఎఫ్​ రేడియో కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూ చేసినట్లు పోలీస్​ ఉన్నతాధికారి తెలిపారు.  

 రేడియో ప్రసార పరిజ్ఞానంతో ఖైదీల  నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా భక్తి ...  ఆధ్యాత్మిక కార్యక్రమాలు  ద్వారా వారిని మంచి మార్గంలో నడిపేందుకు ఉపయోగపడతాయని గుప్తా తెలిపారు. జైలు జీవితం గడిపేవారిలో అశాంతి ఉంటుందని.. వారి కుటుంబం.. భవిష్యత్తు  గురించి ఆలోచిస్తుంటారన్నారు.   ఇలా పలు రకాలైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎఫ్​ఎం రేడియో స్టేషన్​ లో మహిళా ఖైదీలే జాకీలుగా పని చేస్తారన్నారు.  మహిళా ఖైదీలు  జైలు నుంచి విడుదలైన తర్వాత  ఉపాధి కోసం నైపుణ్యాలను పొందుతారని అధికారి తెలిపారు. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (జైళ్లు) గుప్తాతో ముఖాముఖిలో ఖైదీ చౌగులే రేడియో జాకీ పాత్రను పోషించినందున, ప్రస్తుతం ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై చర్చించారు.

జైళ్లలో  ఎఫ్‌ఎం రేడియో కేంద్రం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో కొత్త కాదన్నారు. పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలు, నాగ్‌పూర్ సెంట్రల్ జైలు, అమరావతి సెంట్రల్ జైలు , కొల్హాపూర్ సెంట్రల్ జైలు వంటి ప్రదేశాలలో ఇటువంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయని అధికారి తెలిపారు. కానీ మహిళా ఖైదీలు ఉన్న జైలులో ఎఫ్​ స్టేషన్​ ఏర్పాటు చేయడం ముంబై  బైకుల్లా మహిళా జైలులో తొలిసారిగా ఏర్పాటు చేశారన్నారు.   విదేశీ ఖైదీల మధ్య పరస్పర చర్చ సందర్భంగా, ఇ-ములకత్ ను ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.